WELCOME TO MY BLOG

WELCOME TO MY BLOG

Search This Blog

Sunday 8 June 2014

Happy Trip with FRIENDS

Wednesday 28 March 2012

my birthday


My Birthday Slideshow: Damupravee’s trip to Hyderabad, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Hyderabad slideshow. Take your travel photos and make a slideshow for free.

Sunday 5 February 2012

వై.యస్ నాకు తెలుసు...


                             వై.యస్ నాకు తెలుసు...

వై.యస్ నాకు తెలుసు...
 అదేంటి వై . యస్ అందరకి తెలుసు కదా...
మరి నీకు మాత్రమే తెలుసు అంటునావ్ .... 
అవును.... అందరకి తెలుసు కాని...! అసలు వై. యస్ . అంటే ఇంకా ఏదో ఉంది.
   ఆ  శ్రీ కృష్ణునికి ఆలోచనకి  సైతం  అందని ఆలోచన ఏదో ఉంది .. అందుకే మన వై. యస్ .ఎదురులేని మహానేతగా ఎదిగాడు….

      అందుకే పసుపు రాజకీయం ఆంధ్రమహారష్ట్రంలో థార్ ఎడారిలా పెరుగుతుంటే, అప్పటి కాంగ్రెస్ పార్టీ ఆ ఎడారి ఇసుక పొరల్లో ఒక నీటి బిందువులా ఇంకిపోతుంటే ఆ సమయంలో రాష్ట్రంలోనే కాకుండా దేశ కాంగ్రెసును జీవనదిల ప్రవహిమపజేయగాలిగాడు.. కదలని జలపాతంలా ఉన్న కాంగ్రెసును తన పాదయాత్రతో పరుగులు పెట్టించి కాంగ్రేసుకు మహాసారధిల మిగిలాడు.....
      మహానుభావులు ,మేధావులు , రాజకీయనాయకులు మాత్రమె కలిసే ముఖ్యమంత్రిలా కాకుండా అతిసామన్యుడు సైతం తన చేయ్యిను అందుకోగలిగే ఒక అరుదైన నేతగా నిలిచాడు...
రాష్ట్ర ప్రజలకు అడిగినది లేదనక ఇచ్చిన అపరాధాన కర్ణుడు, రాజనీతి పరిజ్ఞానంలో సుయోధనుడు, ధర్మాధర్మాలలో ధర్మగ్రాజుడైన ధర్మరాజు , వీర పరాక్రమాలలో గాండీవం ధరించిన అర్జునుడు , సార్వభౌమత్వం అని సరిగ్గా పలకటమే రాని మన నాయకులకు నిజమైన సార్వభౌముడు...... ధానత్వానికి, వీరత్వానికి , సూరత్వానికి సాటిగా మిదిలిన ఏకైక నాయకుడు అని యావత్ భారతదేశానికి తెలుసు ......

వై.యస్. అంటే...
ఈ రాష్ట్రంలో ప్రతి వ్రుధుడికి ఆధారువుగా మిగిలిన ఒక కొడుకులా తెలుసు....
ఓ వితంతువుకి ఆరాధించే ఒక అన్నలా , తమ్ముడిలా తెలుసు....
      ప్రతి విద్యార్ధికి ఉన్నత విద్యలను అందించి విద్యాప్రద్హత అయిన పురుష రూపంలో ఉన్న సర్వసతిగా తెలుసు...
     ప్రతి వికలాంగుడికి ఒక స్పూర్తిధాతగా, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించిన దేవుడుగా, ప్రతి రైతుకి నిండు పంటలను అందించే పంచ్చని ప్రకృతిలా తెలుసు....
    తోటినాయకులకు విధేయుడిగా , చతురత , చదరంగ విలువలు కలిగిన రాజకీయ నాయకుడుగా, ప్రత్యర్ధులను సైతం పసినవ్వుల చిన్నారిలా పలకరించే ఒక పాటశాలలా తెలుసు.....
ఏసు మరణించాక దేవుడైతే నా రాజు ఎన్నో కోట్లమందికి ఆరాధ్య దైవంగా నిలిచినా తర్వాత మరణించి వాళ్ళ హృదయలయాలలో చెరగని గుడిగా నిలిచిపోయిన ఒక కరునామయడుగా తెలుసు...


“”ఓ మహారధి...
  కుళ్ళుతో నిన్ను మాకు దూరం చేసింది విధి.....
 అయిన ఎప్పటికి నిన్ను మరవదు మా మది.....
 నీ జ్ఞాపకాలే ఆలయంగా ఉంది మా గుండెల్లో గది....
 అందుకే అయ్యాడు 'జగనన్న'  నీకు మాకు వారధి.....
 ఇకపై అతడే మా సారధి.......””
    
      పాత నీరు పోతే కొత్త నీరు వస్తాయని చెప్పుకునే కాంగ్రెస్ పెద్దలకు వై.యస్. నీరు కాదని, విశ్వసనీయతను , విలువలను, మాటతప్పని మనస్సును, మడమతిప్పని ధైర్యాన్ని ఒక వైపు , నైతక విలువలు లేని నాయకులను ఒక వైపు చేసుకొని భారతదేశా రాజకీయం అనే మహాసాగరాన్ని మదనం చేస్తే పుట్టిన అమృతం అని ఎంత మందికి తెలుసు...? అమృత బిందువే ఒక ఆలిచిప్పాలో పడితే అది ఒక మూత్యంలా మారితే మూత్యమే 'జగన్అని ప్రపంచపటంలో శ్రీలంకంత చిన్న మెదడు ఉన్న రాజకీయ నాయకులకు తెలియకపోవడం విచిత్రం కాదు................
 
                                                                                                                                                                                                  
                                                                                                                    ఈడా.దామోదర్
                                                                                                                     ఐటి విభాగం